తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం మానేరు సందర్శన' - ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తెరాస వైఖరిపై ఆగ్రహంగా ఉన్న ప్రజల దృష్టి మరల్చేందుకే.... ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానేరు సందర్శన చేపట్టారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు.

bjp laxman
ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విమర్శలు

By

Published : Dec 31, 2019, 10:51 PM IST

Updated : Dec 31, 2019, 11:46 PM IST

రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి అధ్వానంగా ఉందని... కేంద్ర ప్రభుత్వ నిధులతో కొంత అభివృద్ధి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ దుయ్యబట్టారు. ఒకవైపు అభివృద్ధి లేని మున్సిపాలిటీలు.. మరోవైపు పాలనా వైఫల్యం.. వీటికి తోడు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం.. వెరసి మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస ప్రజాగ్రహం చవిచూడక తప్పదని జోస్యం చెప్పారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో తెరాసను చావుదెబ్బ కొట్టిన భాజపాపై... కేసీఆర్ ఇంకా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని లక్ష్మణ్​ ఆరోపించారు. పనుల్లో అవినీతే లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ వేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

'ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి మానేరు సందర్శన'
Last Updated : Dec 31, 2019, 11:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details