తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishanreddy fires on KCR : 'రాష్ట్రంలో బుల్డోజర్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది' - బీఆర్​ఎస్​పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన కిషన్​రెడ్డి

Kishanreddy fires on BRS : ముఖ్యమంత్రి కుటుంబాన్ని.. ఫామ్‌హౌస్‌ అరెస్టు చేసే సమయం ఆసన్నమయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్న కిషన్‌రెడ్డి.. కుటుంబ పార్టీలకు రారాజుగా కేసీఆర్‌ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి.. ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

kishanreddy
kishanreddy

By

Published : Jul 21, 2023, 5:29 PM IST

Updated : Jul 21, 2023, 6:27 PM IST

Kishanreddy Comments on BRS and Congress : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌లోనే అరెస్ట్‌ చేస్తామని... రోజులు లెక్క పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. వెయ్యి మంది కేసీఆర్​లు... లక్ష మంది ఓవైసీలు, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో మోదీని గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ కమలదళపతిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం... నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నయా నిజాం తరహాలో పాలన చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Kishanreddy fires on CM KCR : తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలని.. కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నయా నిజాం తరహాలో పాలన చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలతో పాలన చేస్తున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా బుల్డోజర్‌ పాలన తీసుకువస్తామన్నారు. నిజాం భవనాన్ని తలపించేలా ప్రగతిభవన్ కట్టుకున్నారు... తప్పితే పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవని మండిపడ్డారు. బీఆర్​ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలుఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఏ పార్టీతో కలవమని కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ఓల్డ్ సిటీలో ఓ తలకుమాసినోడు ఉన్నారని ఆరోపించారు.

'కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్​లోనే అరెస్టు చేస్తాం. కేసీఆర్ రోజులు లెక్క పెట్టుకోవాలి. మేము నీ కుటుంబానికి బానిసలం కాదు. బీజేపీ, బీఆర్​ఎస్ ఒక్కటని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మేము ఏ పార్టీతోనూ కలవబోము. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు బీజేపీ నేతృత్వంలో యుద్ధం చేస్తారు. ఎవరు ప్రధాన మంత్రో తెలియదు.. కూటములు పెడుతున్నారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకో ప్రధాని మారుతారు. తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి.'-కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishanreddy Takes Charge as BJP State President : కాంగ్రెస్ పార్టీని తలదన్నెలా బీఆర్​ఎస్ అవినీతి చేసిందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. అధ్యక్షుడిని తానే కావొచ్చు.. సమిష్టి నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. అబిడ్స్ చౌరస్తాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బండి సంజయ్‌తో కలిసి తాము పాతరేస్తామమని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ నుంచి తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తొలుత పాతబస్తీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన కిషన్‌రెడ్డి... అంబర్ పేటలోని జ్యోతిరావుపూలే విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. తర్వాత ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కిషన్ రెడ్డి... శాసనసభకు ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. తర్వాత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 21, 2023, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details