తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేట ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి: బండి - నిమ్స్​ ఆస్పత్రిలో బండి సంజయ్​

సూర్యాపేటలో కబడ్డీ పోటీల సందర్భంగా గ్యాలరీ కూలిన ఘటనలో క్షతగాత్రులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పరామర్శించారు. నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సైదులు కుటుంబాన్ని ఓదార్చారు. ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించి, బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

bandi in nims, gallery collaps
bandi sanjay, bjp state president

By

Published : Mar 26, 2021, 10:35 PM IST

సూర్యాపేటలో కబడ్డీ పోటీల సందర్భంగా గ్యాలరీ కూలిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఘటనలో గాయపడి నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైన బాధితులను ఎవ్వరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారన్నారు.

ఈ పోటీలను ప్రభుత్వం నిర్వహించిందా.. లేక రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులా అని ప్రశ్నించారు. ఇంత వరకూ ఏ ఒక్క మంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోటీలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థల్లో నష్టాలు: కాగ్​

ABOUT THE AUTHOR

...view details