తెలంగాణ

telangana

మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి

By

Published : Dec 18, 2020, 10:49 AM IST

భాజపాకు మేయర్‌ పీఠం దక్కనప్పటికీ... హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తామని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన భాజపా కార్పొరేటర్లతో కలిసి... భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఐదేళ్లు భాజపా కార్పొరేటర్లు మంచి సేవలు అందిస్తారని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి
మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి

మేయర్ పీఠం దక్కనప్పటికీ.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి

హిందువులందరికీ శుక్రవారం ప్రత్యేకమైన రోజు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించిందని వెల్లడించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దయతో వచ్చే ఐదేళ్లు భాజపా కార్పొరేటర్లు మంచి సేవలు చేస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులకు తాము తప్పక సహకరిస్తామని స్పష్టం చేశారు.

సీఎం వైఖరి వల్ల హైదరాబాద్‌లో అభివృద్ధి జరగటం లేదని విమర్శించారు. భాజపాకు మేయర్ పీఠం దక్కనప్పటికీ హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. హైదరాబాద్‌ను ఎంఐఎం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఒక వర్గం కోసం మెజార్టీ ప్రజలను అధికార పార్టీ అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి జరగటం లేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. పాతబస్తీకి మెట్రో ఎందుకు రావటం లేదో ఇక్కడి ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికను ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పాలకమండలి గడువు ఇంకా ఉంటే హడావుడిగా ఎన్నికలు ఎందుకు పెట్టారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details