తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి - బండి సంజయ్​ వార్తలు

నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. హైదరాబాద్​ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

bjp state president bandi sanjay tributes to subhash chandrabos
నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి

By

Published : Jan 23, 2021, 10:26 AM IST

Updated : Jan 23, 2021, 11:48 AM IST

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ జయంతి నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. నాయకత్వానికి నిర్వచనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తానన్న సుభాష్‌ చంద్రబోస్‌ అడుగుజాడల్లో నేటి యువత ముందుకుసాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని నియంతపాలనకు చరమగీతం పాడేందుకు యువత ముందుకు రావాలని బండి‌ పిలుపునిచ్చారు.

నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Last Updated : Jan 23, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details