తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ అరెస్టు తీరు చాలా దారుణం: బండి సంజయ్​ - telangana varthalu

ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్​లో అరెస్టు చేసిన తీరు దారుణంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

bjp state president bandi sanjay
ఎంపీ అరెస్టు తీరు చాలా దారుణం: బండి సంజయ్​

By

Published : May 15, 2021, 2:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఎంపీ రఘురామ కృష్టం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణంగా ఉందని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఎంపీని ఈడ్చుకెళ్లడం సహా బలవంతంగా కారులోకి తోయడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అరెస్టుకు లోక్​సభ స్పీకర్ అనుమతి లేకున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా... లేక తమ మిత్రుడైన ఏపీ సీఎం జగన్‌ కోసం అన్నీ నిబంధనల్ని తుంగలోకి తొక్కి నియంతృత్వ పాలన చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ఎంపీని కిడ్నాప్ చేశారో, అరెస్టు చేస్తున్నారో.. ఆయన కుటుంబ సభ్యులకు కొద్దిసేపు అర్థం కాలేదంటే... పరిస్థితి ఎంత దారుణమో తెలుస్తోందన్నారు. రఘురామ కృష్ణం రాజుకు 4నెలల కిందట గుండె చికిత్స జరిగిందని అలాంటి వ్యక్తి పట్ల ఏపీ పోలీసుల వ్యవహారశైలి అమానుషమని బండి మండిపడ్డారు.

ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ

ABOUT THE AUTHOR

...view details