ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 17వ లోక్‌సభలో 36 బిల్లులు ఆమోదం పొందడం మోదీ ఘనతగా చెప్పారు. భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. వైద్యులకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు ఇవ్వాలని భాజపా సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.