తెలంగాణ

telangana

ETV Bharat / state

'రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటాం' - హైదరాబాద్​ తాజా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​ నాచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు.

bjp state president Bandi Sanjay said we will win two MLC positions
'రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటాం'

By

Published : Mar 8, 2021, 3:16 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే పలు సర్వేలు ఆ విషయాన్ని తెలుపుతున్నాయని అన్నారు. 2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​ నాచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు.

భాజపాలో చేరిక

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రాంచందర్​ రావుకు... మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.

ఇదీ చదవండి: మండలి ఛైర్మన్​ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details