Bandi sanjay at Chanchalguda Jail: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో ఆ కమిషన్‌ను రద్దు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఆందోళనలో అరెస్టయి హైదరాబాద్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ సహా ఏడుగురు యువ మోర్చా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. రిమాండ్‌లో ఉన్నవారందరికి సంజయ్ ఆత్మస్థైర్యం నింపారు.
అనంతరం కారాగారం బయట సంజయ్ మీడియాతో మాడ్లాడారు. సాధారణంగా ఛైర్మన్ వద్ద ఉండాల్సిన పాస్వర్డ్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించకుండా సిట్ వేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపరు లీకేజ్ సంబంధించి ఐటీ శాఖ విఫలమైన దృష్ట్యా ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ను తప్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"ఇలాంటి తరహాలోనే వేరే మంత్రి లేదా ఎమ్మెల్యే తప్పు చేస్తే వారిని సీఎం విధులు నుంచి బయటకు పంపేవారు.. కేటీఆర్ తన కొడుకు కాబట్టే వెనకేసుకొస్తున్నారని" ఆరోపించారు. సైబర్ సెక్యూరిటీ, పోలీసు వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడే మంత్రి.. ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఈ కేసుతో తమ పార్టీకి సంబంధం ఉందని అంటగట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.'ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు.. తమ పోరాట ఆగదు.. ఎంత మందిని అరెస్టు చేసి జైళ్లకు పంపుతారో పంపండి.. మేమేం భయపడం' అని సంజయ్ ఘాటుగా హెచ్చరించారు.
Master mind behind TSPSC Paper leakage : ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ్ముడి పేరుతో రేణుక దంపతులు ప్రశ్నాపత్రాలు సంపాదించేందుకు తెరవెనుక పెద్ద తతంగమే నడిపట్లు పోలీసులు గుర్తించారు.