సుష్మా స్వారాజ్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ భాజపా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు నేటితరం నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
చిన్నమ్మ పాత్ర మరువలేనిది: బండి సంజయ్ - హైదరాబాద్ వార్తలు
తెలంగాణ సాధనలో చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చిన్నమ్మ పాత్ర మరువలేనిది: బండి సంజయ్
సుష్మా ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గొంతుక వినిపించిన ధీర వనితగా అయన అభివర్ణించారు. గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలంగాణ ప్రవాసులకు విదేశాంగ శాఖ మంత్రిగా సాయం చేసిన మాతృమూర్తి అని కొనియాడారు.
ఇదీ చూడండి:-ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు