హైదరాబాద్ రామంతాపూర్‌లో భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతిలో... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో యువత ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రయాణించాలి : బండి సంజయ్ - అంబేడ్కర్ జయంతి బండి సంజయ్
అంబేడ్కర్ అడుగుజాడల్లో యువత ప్రయాణించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ రామంతాపూర్‌లో భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
![అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రయాణించాలి : బండి సంజయ్ అంబేడ్కర్ జయంతిలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6789060-1050-6789060-1586864646994.jpg)
అంబేడ్కర్ జయంతిలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
కరోనా వ్యాప్తి నివారణ కోసం లాక్‌డౌన్‌ను ప్రధాని మోదీ పొడిగించారని చెప్పారు. మే 3 వరకు ప్రజలు ఇంటివద్దే ఉండాలని... కరోనాను తరిమికొట్టేందుకు సహకరించాలని కోరారు. కొవిడ్-19 నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న వారిని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి భాజపా కార్యకర్తలు తమ వంతు సహకారం అందిస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'