ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay on eetala : రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారంలో.. వాస్తవం లేదు - మేరా భూత్ సబ్సే మజ్బూత్

Bandi Sanjay on eetala : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని బండి సంజయ్​ తెలిపారు. ఈటల రాజేందర్​పై హత్యకు కుట్ర చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి.. శిక్షించాలని డిమాండ్​ చేశారు. భోపాల్ పట్టణంలో జరిగిన "మేరా భూత్ సబ్సే మజ్బూత్" కార్యక్రమానికి హాజరై తిరిగివచ్చిన.. 350 మంది విస్తారక్​లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో బండి సంజయ్ ఘనస్వాగతం పలికారు.

Bandi
Bandi
author img

By

Published : Jun 28, 2023, 9:19 PM IST

Mera Bhoot Sabse Majbut programme : బీజేపీని విచ్ఛినం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్​పై హత్యకు కుట్ర చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్​ చేశారు.

భోపాల్ పట్టణంలో జరిగిన "మేరా భూత్ సబ్సే మజ్బూత్" కార్యక్రమానికి హాజరై తిరిగివచ్చిన 350 మంది విస్తారక్​లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. 350 మందికి పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అందచేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పరరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మోదీ ఇచ్చిన స్ఫూర్తితో ధైర్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. త్వరలో మండలాల వారిగా నాయకులను బూతు స్థాయిలో సన్నద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీని బూతు స్థాయి నుంచి పటిష్ఠం చేయడానికి మోదీ ఆదేశాల మేరకు "మేరా బూత్ సబ్ సే మజ్బూత్" అనే కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. గతంలో తనపై, ధర్మపురి అర్వింద్​పై దాడికి కుట్ర జరిగిందని దుయ్యబట్టారు. కేసీఆర్ అంటేనే రాజకీయ కుట్రలు, కుతంత్రాలకు మారుపేరుగా మారారని ధ్వజమెత్తారు. కేటీఆర్ ధనం, అధికార బలంతో అహంకారం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

"మేరా భూత్ సబ్సే మజ్బూత్".. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన "మేరా భూత్ సబ్సే మజ్బూత్" ప్రచార కార్యక్రమంలో నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేస్తూ.. బీఆర్‌ఎస్‌ పార్టీని కూడా ప్రస్తావించారు. కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని... మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటువేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది బూత్​ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

"బీజేపీని విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈటల రాజేందర్​పై హత్యకు కుట్ర చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి. బీజేపీని బూతు స్థాయి నుంచి పటిష్ఠం చేయడానికి "మేరా బూత్ సబ్ సే మజ్బూత్" కార్యక్రమం ప్రారంభించాము. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అందచేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పరరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది."- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారంలో.. వాస్తవం లేదు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details