Bandi Sanjay met Padmaja reddy : పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజారెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సన్మానించారు. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి బండి సంజయ్ కుందన్ భాగ్లోని పద్మాజా రెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను అభినందించారు.
Bandi Sanjay met Padmaja reddy : డాక్టర్ పద్మజారెడ్డిని సన్మానించిన బండి సంజయ్ - తెలంగాణ టాప్ న్యూస్
Bandi Sanjay met Padmaja reddy : పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజా రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామితో పాటు పలువురు నేతలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు.

డాక్టర్ పద్మజారెడ్డిని సన్మానించిన బండి సంజయ్
డాక్టర్ పద్మజారెడ్డిని సన్మానించిన బండి సంజయ్
పద్మజారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్... త్వరలోనే అవార్డు గ్రహీతలందరినీ కలుస్తామన్నారు. తెలుగు వారికి పద్మభూషన్, పద్మశ్రీలు వరించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'పక్కటెముకలు, కాలివేలు విరిగేలా పోలీసులు కొట్టారు'
Last Updated : Jan 30, 2022, 2:24 PM IST