తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY LETTER: యాసంగి వడ్ల డబ్బులు ఎప్పుడిస్తారు..?: బండి సంజయ్ - బండి సంజయ్

BANDI SANJAY LETTER: యాసంగి పూర్తైన కేసీఆర్ సర్కార్ రైతులకు ఇంకా డబ్బులు చెల్లించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అమ్ముకున్న పంటలకు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఇకనైనా వారి సమస్య పరిష్కరించాలంటూ కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. అలాగే వానాకాలం మొదలైనందున రైతుబంధు నిధులు కూడా అన్నదాతల ఖాతాలో వేయాలని కోరారు.

BANDI SANJAY LETTER
బండి సంజయ్

By

Published : Jun 22, 2022, 5:14 PM IST

BANDI SANJAY LETTER: యాసంగి వడ్ల కొనుగోలు డబ్బు రైతాంగానికి వెంటనే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. యాసంగిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోనే రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లకు 517.16 కోట్ల రూపాయలు రాష్ట్రప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకి వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించాలని కోరారు.

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతుసంఘాలతో, అన్నీ రాజకీయ పార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనందున రైతులకు రైతుబంధు నిధులు వెంటనే చెల్లించాలని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details