తెలంగాణ ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభదినం ప్రతీకగా నిలుస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిడారంబరంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
'రాష్ట్ర ప్రజలందరికీ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు' - శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్ కుమార్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి సంబురాలు చేసుకోవాలని సూచించారు.
'రాష్ట్ర ప్రజలందరికీ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు'
ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు తమ ఇళ్లలోనే చిన్నికృష్ణునికి స్వాగత సత్కారాలు చేసుకోవాలని సూచించారు. ఆ శ్రీ కృష్ణ భగవానుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భగవంతుడి దయవల్ల కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి త్వరగా వెళ్లిపోవాలని కోరుకున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు