దుబ్బాక ఉప ఎన్నికలు అయిపోయాక కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హితవు పలికారు. సిద్దిపేటలో భాజపా కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్ - Hyderabad latest news
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలు అయిపోయాక కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు.
అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ఓటమి భయంతో మొన్నటిదాకా రోజుకో రకంగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఓటమి తప్పదనే అక్కసుతో భాజపా శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి తిప్పలు తప్పవని హెచ్చరించారు. దుబ్బాక సీటు తర్వాత తన సీటుకు ఎసరోస్తుందనే భయంతో కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు మానుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలు తెరాస ప్రభుత్వం అంచనా కూడా వేయలేదని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయని.. ఆ పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దని సూచించారు.
ఇదీ చూడండి:చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరాహార దీక్ష