తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ - bjp news

స్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కృష్ణదాస్​తో సమావేశమయ్యారు. ఆయనకు కరోనా రావడంతో హోం క్వారంటైన్​లోకి వెళ్లారు.

స్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
స్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By

Published : Sep 15, 2020, 10:49 PM IST

ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పార్టీ సంస్థాగత విషయాలను చర్చించేందుకు ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కృష్ణదాస్​తో సమావేశమయ్యారు.

వైద్యపరీక్షల్లో కృష్ణ దాస్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని స్పీకర్​కి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సమాచారం అందించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details