గత ఎన్నికల్లో హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని చెప్పిన కేసీఆర్... ఎన్నికల తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు.
హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే భాజపాకు పట్టం కట్టండి: బండి - Bandi Sanjay Election Campaign
తెరాసపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తెరాస పోవాలంటే భాజపాకే ఓటు వేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే.. భాజపాకు పట్టం కట్టాలని కోరారు.
అభివృద్ధి కావాలా.. భాజపాకు పట్టం కట్టండి: బండి సంజయ్
భాజపాను గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలంటూ... అంబర్‌పేటలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలంటే భాజపాకు పట్టం కట్టాలని కోరారు. ప్రజలకు ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు భాజపా ప్రణాళికా సిద్ధం చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.