గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా హుస్సేన్ నాయక్ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాక్డౌన్తో గిరిజన సోదరులు ఇబ్బందులు పడితే కేసీఆర్ కేంద్ర ప్యాకేజీ తప్ప రూపాయి ఇవ్వలేదని ఆక్షేపించారు.
గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉద్యమం: బండి సంజయ్ - బండి సంజయ్ తాజా వార్తలు
గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉద్యమం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా హుస్సేన్ నాయక్ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉద్యమం: బండి సంజయ్
గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉద్యమం చేస్తామన్నారు. పేదలు ఇబ్బంది పడ్డందునే దుబ్బాకలో వారంతా ఒక్కటయ్యారని అన్నారు. రాబోయే రోజుల్లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పేదలంతా ఒక్కటై కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో మతమార్పిడిలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఇంతగా మత మార్పిడిలు జరగలేదన్నారు.
ఇదీ చదవండి:కొత్త సాదా బైనామాల దరఖాస్తులు పరిశీలించవద్దు : హైకోర్టు