తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయులపై ఎందుకంత వివక్ష : సంజయ్​

ఉద్యోగ సంఘాలతో భేటీకి ఉపాధ్యాయులను పిలవకపోవడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. ఐదేళ్లకోకసారి ఇవ్వాల్సిన పీఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. గ్రేటర్​ ఎన్నికల్లో బాధ్యతలను ఉపాధ్యాయులకు ఇవ్వకుండా వివక్ష చూపారని విమర్శించారు.

bjp-state-president-bandi-sanjay-fire-on-cm-kcr
ఉపాధ్యాయులపై ఎందుకంత వివక్ష : బండిసంజయ్​

By

Published : Dec 31, 2020, 2:41 PM IST

ప్రగతి భవన్​లో జరిగే ఉద్యోగ సంఘాల భేటీకి ఉపాధ్యాయులను పక్కన పెట్టడంపై భాజపా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిదని అన్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో సైతం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించలేదని విమర్శించారు.

ఉపాధ్యాయులపై సీఎం ఎందుకు వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకు ఐదేళ్లకోకసారి పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులను చర్చలకు ఆహ్వానించి వారి డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భాజపా ఎల్లప్పుడు వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేసేదాకా పోరాడుతామని బండి సంజయ్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి:నుమాయిష్​ వాయిదా... కొవిడ్​ నిబంధనలే కారణం

ABOUT THE AUTHOR

...view details