ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే తమ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. న్యాయవాద దంపతుల హత్యపై సీఎం నోరు విప్పకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఇంటిలిజెన్స్ అధికారి ప్రభాకరరావు ద్వారా తెలంగాణలో సీఎం కేసీఆర్ గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభాకరరావు అక్రమ ఆస్తుల చిట్టాను తవ్వుతామని బండి సంజయ్ హెచ్చరించారు. గుర్రంపోడు తండా ఘటనలో భాజపా నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.