ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులుపెట్టడం, దాడులకు పాల్పడటం తగదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హితవు పలికారు. తెరాస కార్యకర్తల దాడిలో గాయపడిన సూర్యాపేట జిల్లాకు చెందిన ఉస్మానియా లా విద్యార్థి సురేశ్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌లో ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే విద్యార్థులు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎంతో మంది విద్యార్థులు బలిదానాల ఫలితమే తెలంగాణ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఎవరి వల్ల వచ్చిందో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి ఆలోచించాలన్నారు. సురేష్‌యాదవ్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గుండాలను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. సురేశ్ యాదవ్‌పై 25 మంది గుండాలు దాడి చేస్తే సీఎం కేసీఆర్ స్పందించరా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించారు.