స్వేరోస్ సంస్థ సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తోందని ఆరోపిస్తూ.. ఆ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే కేసీఆర్ తన విధిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
లెక్కలు ఆరా తీయాలి