భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో భాజపా పక్షాన సైకిల్‌పై ప్రచారం చేసిన కరీంనగర్ చెందిన సాయి... పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చిన సంజయ్‌కి సాయి కనపడగా... సైకిల్ తొక్కుతూ రోడ్డు మీదకు వచ్చారు.
సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బండి సంజయ్ - సైకిల్ తొక్కి ఉత్సాహం నింపిన బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరదాగా సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సైకిల్ తొక్కుతున్న బండి సంజయ్‌ని చూసి పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బండి సంజయ్
సైకిల్ తొక్కుతున్న బండి సంజయ్‌ని చూసి పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దుబ్బాకలో ప్రచారం చేసిన సాయి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయనున్నారు.