bandi sanjay fire on govt: నిరుద్యోగ దీక్షకు అడ్డంకులు సృష్టించడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దీక్షతో పీఠం కదిలిపోతుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
bandi sanjay Unemployment initiation: కొవిడ్ నిబంధనలకు లోబడి మా పార్టీ కార్యాలయంలో ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ప్రభుత్వానికి అభ్యంతర ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ దీక్షతో కేసీఆర్కు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్న దీక్షకు రాకుండా విద్యార్థి నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.