లాక్‌డౌన్ వేళ ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అకాల వర్షాలకు ధాన్యం తడసి రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవటం లేదన్నారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని ప్రభుత్వమే వెల్లడించిందన్నారు. అందులో కనీసం 30లక్షల టన్నుల ధాన్యం కూడా కొనలేదని విమర్శించారు.
యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి: బండి సంజయ్ - ధాన్యం కొనుగోళ్లపై బండి సంజయ్
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అకాల వర్షాలకు అన్నదాతలు నష్టపోతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలకు 20 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చిందని, మరో 3లక్షల డోసులను త్వరలోనే అందజేస్తుందన్నారు. కేంద్రం 61 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు అందిస్తే.... కేవలం 54 లక్షలు వినియోగించారని తెలిపారు. నిల్వలు ఉన్నప్పటికీ.... రెండ్రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎందుకు నిలిపివేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడి విషయంలో అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టి.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టినట్లు ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.