అబద్ధాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు తెరాస కుట్రలు పన్నుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రులు, తెరాస నేతల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. ఫోర్జరీ సంతకంపై ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా స్పందనలేదని ఆరోపించారు. వరదసాయం తీసుకున్న వారికి కూడా మళ్లీ సాయం అందిస్తామని స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాను నియంత్రించలేవని ధీమా వ్యక్తం చేశారు.
వరదసాయం తీసుకున్న వారికి మళ్లీ సాయం: బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌లు భాజపాను నియంత్రించలేవని బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
హిందువునైన నేను... సీఎం కేసీఆర్‌ను భాగ్యలక్ష్మీ దేవాలయానికి పిలిస్తే ఎందుకు రాలేదు. భాగ్యలక్ష్మీ దేవాలయానికే ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. భాగ్యనగరం పేరు ఎలా వచ్చిందో మీ తెలియదా? పాతబస్తీ నుంచి బకాయిలు వసూలు చేసిన తర్వాతనే తెరాస ఓట్లు అడగాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు. చలాన్లు కడతామని చెప్పాం.. నిబంధనలు అతిక్రమించాలని చెప్పలేదు. రేపు కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ ఛార్జిషీట్ విడుదల చేస్తారు. త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తాం.
---- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- ఇదీ చూడండి'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'