తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చింది: బండి సంజయ్‌ - Solving the problem of registrations

Bandi Sanjay Comments On TRS: ఎల్బీనగరర్​లో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 8 ఏళ్లగా అక్కడి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఈ వార్తతో వారికి విముక్తి కలిగినట్లైయిందన్నారు.

Bandi Sanjay Comments On TRS:
Bandi Sanjay Comments On TRS:

By

Published : Nov 2, 2022, 10:46 PM IST

Bandi Sanjay Comments On TRS: ఎల్బీనగర్​లో ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఇది భాజపా, బాధితుల విజయం అన్నారు. 8 ఏండ్లుగా అక్కడి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని తెలిపారు.

బైపోల్​లో తెరాస ఓటమి భయంతోనే ఈ జీవో జారీ చేసిందని అన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా వెంటనే జీవోను అమలు చేయాలని కోరారు. ఎన్నికల తరువాత పెండింగ్​లో పెడితే కేసీఆర్ సర్కారు అంతు చూస్తామని హెచ్చరించారు. ఇండ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు పూర్తి పరిష్కారం దొరికే వరకు బాధితులకు భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details