ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యతని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జర్నలిస్ట్ రఘు అరెస్టును ఆయన ఖండించారు. తెరాస ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిస్తే.. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కాలని ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.
Bandi Sanjay: ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితే అరెస్టు చేస్తారా?: బండి - జర్నలిస్ట్ రఘు అరెస్టు
జర్నలిస్టులు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్ట్ రఘు అరెస్టును ఆయన ఖండించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూముల్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన బాగోతాన్ని మీడియాలో ప్రసారం చేస్తే కేసు పెట్టడమేంటని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూముల్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన బాగోతాన్ని మీడియాలో ప్రసారం చేస్తే కేసు పెట్టడమేంటని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల కబ్జాలపై వార్తలు రాస్తే కేసులు పెడుతామన్న సంకేతాలను కేసీఆర్ సర్కార్ ఇస్తోందన్నారు. వాస్తవాలను రాసే జర్నలిస్టులపై కేసులు పెడితే జైళ్లన్నీ రిపోర్టర్లతో నిండిపోతాయని దానికి సీఎం సిద్ధంగా ఉన్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు.
ఇదీ చూడండి:Telangana Council: ప్రొటెం ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి