తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'ప్రజలను మోసం చేస్తున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు' - Bandi sanjay on river boards

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బోర్డుల సమావేశాలకు హాజరైతే తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

BANDI
బండి సంజయ్

By

Published : Aug 11, 2021, 5:19 PM IST

Updated : Aug 11, 2021, 5:28 PM IST

గోదావరి, కృష్ణా బోర్డులు (River Boards) ఏర్పాటు చేసి నదీజలాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం.. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ (Apex Council) నిర్ణయం మేరకు నోటిఫై చేశారని వివరించారు. బోర్డుల సమావేశానికి కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు హాజరయ్యారని.. కానీ సీఎం కేసీఆర్ (Cm Kcr) డుమ్మా కొట్టారని విమర్శించారు.

'ప్రజలను మోసం చేస్తున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు'

హైదరాబాద్ జలసౌధలో తెలంగాణ ఈఎన్సీ సమావేశానికి హాజరుకాలేదు. ఎందుకు హాజరుకాలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్... నీటి విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటున్నారా.. అన్యాయం చేయాలనుకుంటున్నారా? కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నారు. తెలంగాణ అధికారులు సమావేశానికి హాజరైతే ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం ఉండేది. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం కూడా ఉండేది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని నేను కేంద్రాన్ని కోరితే.. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశారు. బిజీ ఉన్నానని సమావేశానికి రాలేదు. దేశంలో కేసీఆర్ ఒక్కడే రోజువారీ షెడ్యూల్ విడుదల చెయ్యడు. కృష్ణాలో తెలంగాణాకి 555 టీఎంసీలు రావాల్సి ఉంటే కేవలం 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడు. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్​కు వస్తున్నాయి. కేసీఆర్, చంద్రబాబు, హరీశ్​ రావు, అప్పటి నీటి సలహాదారు విద్యాసాగర్ రావు నీటి వాటా ఒప్పందానికి ఒప్పుకున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం కట్టకుండా చూడాలని ప్రినిపల్ సెక్రెటరికి లేఖ రాశాను. ఉన్న 299 టీఎంసీలు కూడా వాడుకోవడం లేదు. కృష్ణాలో ఏపీకి కేటాయించిన నీటి కంటే 150 టీఎంసీలు అదనంగా వాడుకుంటున్నారు. బోర్డుల సమావేశాలకు హాజరైతే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. సమావేశాలకు హాజరైతే ప్రాజెక్టు డీపీఆర్​లు అంచనాలు అన్నీ బయటకు వస్తాయి. 299 టీఎంసీ నీటికి ఒప్పుకున్నట్లు బయటపడుతుంది. కాబట్టే సమావేశాలకు కేసీఆర్ హాజరుకావడం లేదు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే కొత్త ట్రైబ్యునల్ వేస్తామని జలశక్తి మంత్రి చెప్పారు. గత అక్టోబర్​లో ఉపసంహరించుకుంటామన్నారు. మళ్లీ అక్టోబర్ వస్తుంది. ఎందుకు కేసు ఉపసంహరించుకోలేదో చెప్పాలి. కేసీఆర్ తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహి. నీళ్ల కోసం తెలంగాణ ఏర్పడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారు. కేసీఆర్ కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలకు హాజరుకావాలి.

-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: Huzurabad: ఎవరీ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... కేసీఆర్ ఆయన్నే ఎందుకు ప్రకటించారు?

Last Updated : Aug 11, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details