ఔట్ సోర్సింగ్ నర్సుల తొలగింపును నిరసిస్తూ ధర్నా చేపట్టిన భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. పోలీసులు వారి పట్ల వ్యవహరించిన తీరును బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహారిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని సంజయ్ హెచ్చరించారు. నిరంకుశ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా భాజపా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని వెల్లడించారు.
సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోంది..