భాజపా నాయకులు, కార్యకర్తలను బెదిరించేధోరణిలో మంత్రి కేటీఆర్ మాట్లాడటం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.భాజపా ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆందోళన నిర్వహించినట్లు పేర్కొన్న ఆయన.. ఎన్నడూ దాడులు చేయలేదని గ్రహించాలన్నారు.
'భాజపా కార్యకర్తలను బెదిరించేలా కేటీఆర్ మాట్లాడటం సరికాదు' - bandi sanjay latest news
భాజపా కార్యకర్తలను బెదిరించేలా కేటీఆర్ మాట్లాడటం సరికాదని బండి సంజయ్ అన్నారు. భాజపా కార్యకర్తలను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
'భాజపా కార్యకర్తలను బెదిరించేలా కేటీఆర్ మాట్లాడటం సరికాదు'
తెరాస సర్కారు అక్రమ కేసులతో భాజపా కార్యకర్తలను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ... నేడు అన్ని జిల్లా, మండల శాఖల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సర్కారు వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ శ్రీనివాస్ అనే కార్యకర్త బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఇవీ చూడండి: దుబ్బాకలో గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్