Bandi sanjay on farmers meet తప్పుడు లీకులతో సీఎం కేసీఆర్ ఏమార్చుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో రైతులతో సమావేశంలో కేవలం సేంద్రీయ, ప్రకృతి సాగు పద్ధతులపైనే చర్చించారని ఆయన వెల్లడించారు.
విద్యుత్ సవరణ చట్టాల మీద ఎలాంటి చర్చ జరగలేదు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం గురించే అమిత్ షా మాట్లాడారు. దిల్లీలో విద్యుత్ చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారు. కేసీఆర్ దిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రానికి వచ్చి మాట మార్చారు.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు