గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బస్తీ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహం అమలు చేస్తున్నారు. బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి అల్లాపూర్ డివిజన్ వివేకానందనగర్‌లో బస్తీ నిద్ర చేశారు.
వివేకానందనగర్‌లో బండి సంజయ్ బస్తీ నిద్ర - బండి సంజయ్ బస్తీ నిద్ర వార్తలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అల్లాపూర్ డివిజన్ వివేకానందనగర్‌లో బస్తీ నిద్ర చేశారు. డివిజన్ భాజపా అభ్యర్థి పులిగోళ్ల శ్రీలక్ష్మి ఇంట్లో సంజయ్ భోజనం చేసి.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే నిద్రించారు.
వివేకానందనగర్‌లో బండి సంజయ్ బస్తీ నిద్ర
అల్లాపూర్ డివిజన్ భాజపా అభ్యర్థి పులిగోళ్ల శ్రీలక్ష్మి ఇంట్లో సంజయ్ భోజనం చేసి.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే నిద్రించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బస్తీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'