బల్దియా ఎన్నికల వేళ... రాష్ట్ర భాజపాలోకి ఇతర పార్టీ నేతల చేరికలపై ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కీలక నేతలను కలిసిన కమలం పార్టీ నేతలు.. తాజాగా శాసన మండలి మాజీ ఛైర్మన్, తెరాస నేత స్వామిగౌడ్‌ను కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు లక్ష్మణ్, చింతల రామచందార్రెడ్డి... బంజారాహిల్స్‌లోని ఓ భాజపా కార్యకర్త ఇంట్లో స్వామిగౌడ్‌ను కలిశారు.
స్వామి గౌడ్ మొదటి నుంచి హిందు భావజాలం కలిగిన వ్యక్తని, ఆర్ఎస్ఎస్తో అనుంబంధం ఉందని బండి సంజయ్ అన్నారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పుకొచ్చారు. తెరాస పాలనలో ఉద్యమకారులకు న్యాయం జరగకపోవటంతో బయటకి వస్తున్నారని సంజయ్ అన్నారు.