భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ కార్యాలయంలో జరగనుంది. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పాల్గొననున్నారు.
భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం... సాగర్ ఉపఎన్నికలపై చర్చ
సాగర్ ఉపఎన్నికలలో అనుసరించాల్సి వ్యూహాలపై, ప్రచార సరళిపై భాజపా నేతలు చర్చించున్నారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశం... పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం... సాగర్ ఉపఎన్నికలపై చర్చ
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రచార సరళిపై భాజపా నేతలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నేతలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొననున్నారు.