తెలంగాణ

telangana

ETV Bharat / state

tharun chug: 'ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారిని కేంద్రం గమనిస్తోంది'

ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఆగడాలను.. కేంద్రం గమనిస్తోందని... సమయం వచ్చినప్పుడు వారిని జైలులో పెడుతుందని... భాజపా రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌ఛుగ్​ హెచ్చరించారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద దళిత మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన... డప్పుల మోత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అటు భాజపా రాష్ట్ర కార్యాలయంలో... హుజురాబాద్‌ గెలుపుపై చర్చించారు. అనంతరం జీహెచ్​ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పాల్గొన్నారు.

bjp meeting
bjp meeting

By

Published : Nov 10, 2021, 4:28 AM IST

Updated : Nov 10, 2021, 6:49 AM IST

రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో... హైదరాబాద్​లో డప్పుల మోత కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు భాజపా నేతలు, కార్యకర్తలు డప్పులతో ర్యాలీ చేశారు. ట్యాంక్ బండ్​పై అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ పాల్గొన్నారు. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఆగడాలను.. కేంద్రం గమనిస్తోందని.. సమయం వచ్చినప్పుడు జైలుకు పంపిస్తామని.. హెచ్చరించారు (BJP STATE AFFAIRS INCHARGE TARUN CHUGH FIRE ON CM KCR).

'ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారిని కేంద్రం గమనిస్తోంది'

కేసీఆర్‌ గారు.. హైదరాబాద్‌లోనే ప్రభుత్వం ఉందని అనుకోవద్దు. దీనిపైన దిల్లీ ప్రభుత్వం కూడా ఉంది. అది చూస్తూ ఉంది. మీ కుటుంబం తెలంగాణను ఎలా దోచేస్తున్నారో చూస్తూ ఉంది. ప్రతి లెక్కా రాసుకుంటుంది. దోచేసుకున్న ప్రజల సొమ్ము ‌ప్రతి పైసా ఖజానాకు తిరిగి చేరేలా చేస్తాం. దోచుకున్న వారిని జైలుకు పంపిస్తాం.- తరుణ్‌ఛుగ్​,‌ భాజపా రాష్ట్ర ఇంఛార్జి.

కేసీఆర్​ ఎత్తుగడల్ని చిత్తు చేయాలి

అనంతరం నాంపల్లిలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో... ముఖ్య నేతలతో తరుణ్ ఛుగ్ సమావేశం అయ్యారు. బండి సంజయ్ (bandi sanjay) అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, విజయశాంతి.. పలువురు సీనియర్లు హాజరయ్యారు (bjp leaders meeting). హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంపై చర్చించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించేలా పని చేయాలని తరుణ్ ఛుగ్ సూచించారు. భాజపా జీహెచ్​ఎంసీ కార్పొరేటర్‌లతో సమావేశమైన తరుణ్‌ ఛుగ్‌... ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపిక పై కసరత్తు వేగవంతం చేశారు. ఈ పదవుల్లో ఎవరిని నియమించాలనే అంశంపై కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నారు. ఫ్లోర్ లీడర్, డిప్యూటీ లీడర్ ఎవరు ఉండాలో ఒక్కో కార్పొరేటర్ నుంచి షీల్డ్ కవర్​లో అభిప్రాయం తీసుకున్నారు.

బండి సంజయ్​ అధ్యక్షతన పలు కార్యక్రమాలు

ఇవాళ భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పలు సమావేశాల్లో తరుణ్‌ ఛుగ్‌ పాల్గోనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కార్యవవర్గ సమావేశాలు.. నవంబర్ 16న తలపెట్టనున్న ‘నిరుద్యోగుల మిలియన్ మార్చ్’, నవంబర్ 21న రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ సహా అనేక అంశాలపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చూడండి:Tarun Chugh: ఇది ట్రైలర్‌ మాత్రమే... అసలు సినిమా త్వరలో చూపిస్తాం: తరుణ్‌చుగ్‌

Last Updated : Nov 10, 2021, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details