తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగర నేతలతో భాజపా ఇంఛార్జీ తరుణ్‌చుగ్ భేటీ - భాజపా నేతలతో భేటీ అయిన తరుణ్‌చుగ్

భాజపా నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 149 మంది భాజపా నేతలతో ఆయన భేటీ అయ్యారు.

bjp state Incharge Tarun Chugh who met with Bhagyanagar leaders
భాగ్యనగర నేతలతో భేటీ అయిన ఇంఛార్జీ తరుణ్‌చుగ్

By

Published : Dec 18, 2020, 12:41 PM IST

భాగ్యనగర నేతలతో భేటీ అయిన ఇంఛార్జీ తరుణ్‌చుగ్

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 149మందితో ఆయన సమావేశమయ్యారు.

గెలిచిన కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమంతోపాటు... ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలో తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఓటమి చెందిన అభ్యర్థులు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. రాబోయే రోజులు భాజపావేనని కష్టపడి పని చేస్తే తగిన గుర్తింపు ఉంటుందని మార్గ నిర్దేశం చేశారు.

ఇదీ చూడండి :మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి

ABOUT THE AUTHOR

...view details