తెలంగాణ

telangana

ETV Bharat / state

bjp state meeting: భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. రైతు సమస్యలపై తీర్మానాలు

bjp state executive meeting:భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు బండ్లగూడ మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, భాజపా నాయకులు, కార్యకర్తలపై తెరాస చేస్తున్న దాడులు, రైతాంగ, నిరుద్యోగ, దళిత, గిరిజన, కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నారు.

bjp state executive meeting: ప్రారంభమైన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
bjp state executive meeting: ప్రారంభమైన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

By

Published : Nov 26, 2021, 2:07 PM IST

bjp state executive meeting: రాష్ట్రంలో భాజపాను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసి సమష్టిగా కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(bandi sanjay) పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను... నాయకులు గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు. బండ్లగూడ మహవీర్​ ఇంజినీరింగ్​ కళాశాలలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆయన ప్రారంభించారు.

రైతు సమస్యలపై తీర్మానాలు

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ఈ సమావేశంలో దళితబంధు, రైతుల సమస్యలు, ధరణి లోపాలపై తీర్మానాలు చేశారు. దళితబంధును ప్రభుత్వం అమలు చేసేలా పోరాటం చేయాలని భాజపా నిర్ణయించింది.

రేపు భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన

ఈ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయాలు, భాజపా నేతలు, కార్యకర్తలపై తెరాస దాడులతో పాటు రైతు, నిరుద్యోగ, దళిత, గిరిజన, కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు. రెండోరోజు సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం రేపు సాయంత్రం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.

ప్రాంగణం కాషాయమయం

ఇవాళ సమావేశానికి శాసనసభా పక్ష నేత రాజాసింగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

Kolatam event in Singareni school: అట్టహాసంగా జానపద కోలాటం.. ఆద్యంతం కనువిందు

ABOUT THE AUTHOR

...view details