తెలంగాణ

telangana

ETV Bharat / state

దక్షిణ తెలంగాణను కేసీఆర్​ విస్మరించారు: లక్ష్మణ్​ - సీఎం కేసీఆర్​పై లక్ష్మణ్​ విమర్శలు

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్‌ స్వార్థ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురయ్యే అవకాశం ఉందని లక్ష్మణ్​ విమర్శించారు. కృష్ణా నీరు తరలింపును ఆపాలని ​డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్‌ ఉత్తర తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దక్షిణ తెలంగాణను విస్మరించారని విమర్శించారు. జగన్‌, కేసీఆర్‌ అన్నదమ్ములంటూ ఏపీ నీటిపారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ ప్రకటించడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోందని తెలిపారు.

దక్షిణ తెలంగాణను కేసీఆర్​ విస్మరించారు: లక్ష్మణ్​
దక్షిణ తెలంగాణను కేసీఆర్​ విస్మరించారు: లక్ష్మణ్​

By

Published : May 12, 2020, 7:50 PM IST

కృష్ణా నీళ్ల దొంగతనాన్ని ఆపాలని భాజపా మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్‌ స్వార్థ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్‌ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్లు అమాయకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు తానే మార్గదర్శకుడు అన్నట్లు వ్యవహారిస్తోన్న కేసీఆర్‌.. ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న కొత్త లిఫ్ట్​ గురించి తెలియదనడం ప్రజల చెవుల్లో పూలు పెట్టడమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

"కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దక్షిణ తెలంగాణను విస్మరించారు. కొత్త లిఫ్ట్​తో శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతే పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగనుంది. జగన్‌, కేసీఆర్‌ అన్నదమ్ములంటూ ఏపీ నీటిపారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ ప్రకటించడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. కాళేశ్వరం కింద చేపట్టే ప్రాజెక్టులన్నీ తన ఘనతగా చెప్పుకునే కేసీఆర్‌.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఈ వంచనకు ఏమని సమాధానం చెబుతారు."

-లక్ష్మణ్​, భాజపా మాజీ అధ్యక్షుడు

ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన

ABOUT THE AUTHOR

...view details