తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారంలోకి రాగానే ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయారా?, కేసీఆర్​కు కిషన్​రెడ్డి బహిరంగ లేఖ

BJP State Chief Kishan Reddy Letter To KCR : కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తానన్న అభివృద్ధిని చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో దళితుడిని ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సారంగపాణి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.

Kishan Reddy Comments on Telangana Development
BJP State Chief Kishan Reddy Letter To KCR

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 3:01 PM IST

BJP State Chief Kishan Reddy Letter To KCR : అధికారంలోకి రాగానే ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని సీఎం కేసీఆర్​పై బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్​కు బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి (Kishan Reddy) బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో దళిత వర్గాలను మభ్య పెట్టేందుకు దళితుడిని సీఎం చేస్తారని మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో కూడా దళితుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అని ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాట చెబితే తప్పరని అన్నవారు.. దళితుడిని ఎందుకు సీఎంను చేయలేదని ప్రశ్నించారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచార జోరును పెంచింది. సికింద్రాబాద్

BJP Chief Kishan Reddy Slams KCR : రాష్ట్రంలో 20 శాతానికి పైగా ఉన్న దళిత అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే కేటీఆర్ అవహేళన చేశారని మండిపడ్డారు. కులం ముఖ్యం కాదు గుణం ముఖ్యం అంటున్నారు.. దీన్ని ప్రకారం చూస్తే దళితుల పట్ల కేసీఆర్​కు ఎంత గౌరవం ఉందో అని ఎద్దేవా చేశారు.

Kishan Reddy Comments on Telangana Development : తెలంగాణలో బీసీల పట్ల కేసీఆర్​కు (KCR) పట్టింపు లేదని ఆరోపించారు. కేసీఆర్ మాట నీటిపై రాత అని నిరూపించారని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాజ్యంగా మార్చారని విమర్శించారు. దాన్ని కుటుంబానికి పంచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న మీ కుమారుడిని, కుమార్తెను రాష్ట్ర ప్రజలపై గుదిబండలా రుద్దారని మండిపడ్డారు.

ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదు : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేశ్

మేకల సారంగపాణికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి రోడ్ షో నిర్వహించారు. వారాసిగూడ కూడలి నుంచి చిలకలగూడ వరకు నిర్వహించిన రోడ్​ షోలో సారంగపాణిని గెలిపించాలని ఆయన ఓటర్లని కోరారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. 9 ఏళ్లలో కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. అర్హులకు రెండు పడకగదుల ఇళ్లు, దళిత బంధు, బీసీ బంధు ఇచ్చిన దాఖాలాలు లేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే బీజేపీని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.

ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్

రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం- ఆరు సభలు, హైదరాబాద్​లో రోడ్​ షో, షెడ్యూల్ ఇదే

ABOUT THE AUTHOR

...view details