BJP State Chief Kishan Reddy About Telangana Assembly Elections : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి జెండా ఎగురవేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన (Telangana Elections) అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ మార్పు కేవలం బీజేపీతో వస్తుంది అని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు బీజేపీ పూర్తి సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా కమిటీలు సమావేశాలు జరిపి ప్రచారానికి సంబంధించిన అంశాలను నిర్ణయిస్తారు. నేతలంతా ఐకమత్యంగా పోరాడి ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలనను తుడిచిపెట్టాలని ప్రధాని (Narendra Modi) చెప్పారన్నారు. రెండు, మూడు స్థానాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలని ఆదరించవద్దని ప్రజలకు విన్నవించారు. ఉద్యమ ద్రోహులందరు ప్రగతిభవన్‌లో చేరిపోయారని ఆరోపించారు.
Ready To Face Elections says BJP State Chief KishanReddy : ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఆశీర్వదించారని కోరారు. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సకలజనుల పాలన తెలంగాణలో రావాలన్న ఆయన... బీజేపీతోనే సకలజనుల పాలన సాధ్యం అని తెలిపారు. డబ్బు, అధికార దుర్వినియోగం లేకుండా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత మొట్టమొదటి సభ మంగళవారం ఆదిలాబాద్‌లో జరగనుంది. ఆదిలాబాద్‌లో జరగబోయే సభలో అమిత్‌షా ప్రసంగిస్తారు. సాయంత్రం ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో అమిత్‌షా (Amit Shah) సమావేశం అవుతారని తెలిపారు. సమ్మక్క సారక్క ఆశీస్సుల కోసం ముఖ్య నేతలంతా ములుగు వెళుతున్నాం అని తెలిపారు.