బుధవారం సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిర్వహించే భాజపా ప్రాంతీయ జన్ సంవాద్ (వర్చువల్ ర్యాలీ)లో పెద్దఎత్తున పాల్గొన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొంటారని తెలిపారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి.. ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ర్యాలీ తలపెట్టినట్లు సంజయ్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికల ద్వారా వీక్షించాలని ప్రజలను కోరారు.