తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్బరుద్దీన్ కేసును కొట్టివేయడం విస్మయం కలిగిస్తోంది' - Akbaruddhin case

Bandi Sanjay On Akbaruddhin: అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని బండి విమర్శించారు. ఎంఐఎంతో తెరాస ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.

Bandi
Bandi

By

Published : Apr 13, 2022, 9:25 PM IST

Bandi Sanjay On Akbaruddhin: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రపంచమంతా విన్నదని... అయినా నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం లేదన్నారు.

కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం లేదని... ఎందుకంటే న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని బండి విమర్శించారు. ఎంఐఎంతో తెరాస ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎం పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు. 2009లో అక్బరుద్దీన్‌పై కేసు నమోదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంతో కుమ్కక్కై కేసును నీరుగార్చిందని ఆరోపించారు.

అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్‌లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసిందన్నారు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్‌కు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్-తెరాస-ఎంఐఎం కుమక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details