కేసీఆర్ మంత్రివర్గం అలీబాబా 40దొంగలు మాదిరి రాష్ట్రాన్ని దోచుకుంటోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్(BJP state affairs Incharge tarun chugh)ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలదేనని అన్నారు. కేసీఆర్ అహంకారంతో పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపైన కేంద్ర ప్రభుత్వం ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ట్రైలర్ మాత్రమేనని... త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని అన్నారు.
Tarun Chugh: ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా త్వరలో చూపిస్తాం: తరుణ్‌చుగ్ - హైదరాబాద్ జిల్లా వార్తలు
హుజూరాబాద్ ఉపఎన్నిక ట్రైలర్ మాత్రమేనని... త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్(BJP state affairs Incharge tarun chugh) అన్నారు. మోదీ అశీర్వాదంతో తెలంగాణలో రామరాజ్యం రాబోతోందని తెలిపారు. కేసీఆర్ అహంకారంతో పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు కింద 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన భాజపా 'డప్పు మోత' కార్యక్రమంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు భాజపా నేతలు, కార్యకర్తలు డప్పులతో ర్యాలీ చేశారు. రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:Bandi sanjay comments on kcr speech: కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్..