తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ ముక్త భారత్ ఏ పార్టీని ఉద్దేశించింది కాదు:సాజియా ఇల్మి - హైదరాబాద్​లో కాంగ్రెస్ ముక్త భారత్ పుస్తకావిష్కరణ

'కాంగ్రెస్ ముక్త భారత్' అనేది అందరి దగ్గర ఉండాల్సిన పుస్తకమని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సాజియా ఇల్మి అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 'దేశ రాజకీయ ముఖచిత్రం...ఇండియా' అనే సదస్సులో యూఐ హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ అభిషేక్‌ సొంతాలియా, సహా ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ మలానీలతో కలిసి ఆమె ఈ బుక్​ను ఆవిష్కరించారు.

congress mukt bharat book launch in hyderabad
హైదరాబాద్​లో కాంగ్రెస్ ముక్త భారత్ పుస్తకావిష్కరణ

By

Published : Apr 10, 2021, 5:00 PM IST

ప్రముఖ రచయిత అమిత్‌ భగారియా రాసిన కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ పుస్తకం ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించింది కాదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సాజియా ఇల్మి అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 'దేశ రాజకీయ ముఖచిత్రం...ఇండియా' అనే సదస్సులో పాల్గొన్న ఆమె యూఐ హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ అభిషేక్‌ సొంతాలియా,‌ సహా ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ మలానీలతో కలిసి ఈ బుక్​ను ఆవిష్కరించారు.

'కాంగ్రెస్ ముక్త భారత్' అనేది ప్రతి ఒక్కరి వద్ద ఉండాల్సిన పుస్తకమని సాజియా ఇల్మి అన్నారు. ఇది కొత్త అలోచనలను, దార్శనికతకు నాంది పలికే పుస్తకమన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉందనే విషయాలను బుక్​లో స్పష్టంగా తెలిపారని అన్నారు. దాదాపు 17 నెలల కష్టపడి ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయిత అమిత్‌ భగారియా తెలిపారు. 14 మంది ప్రధానుల ఆధ్వర్యంలో దేశం ఎలాంటి ప్రగతి సాధించింది అనే అంశాలను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:'ఆ రెండు పార్టీలు సాగర్​ను పాలించినా అభివృద్ధి శూన్యం'

ABOUT THE AUTHOR

...view details