మజ్లిస్ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందని భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లను ఆధారం చేసుకొని ఎంఐఎం దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. ఎంఐఎంకు తోడు పార్టీలుగా తెరాస, కాంగ్రెస్ మారాయని దుయ్యబట్టారు.
పార్లమెంట్లో మాత్రం లౌకికవాదమా?
యువతితో పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయించిన అసదుద్దీన్... పార్లమెంట్లో మాత్రం లౌకికవాదం గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. సెక్యులరిజం గురించి చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.