తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా సేవా కార్యక్రమాలు - తెలంగాణ వార్తలు

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. లాక్​డౌన్ నిబంధనలు అమలు చేస్తూ మహమ్మారిని కట్టడి చేసేలా రాష్ట్రంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ తెలిపారు. ప్రతి డివిజన్‌లో కనీసం 10కేంద్రాల్లో నిర్వహించాలని కోరారు.

BJP service programs, bjp
భాజపా, భాజపా సేవా కార్యక్రమాలు

By

Published : May 29, 2021, 10:14 PM IST

Updated : May 30, 2021, 12:02 AM IST

నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకోవడంతోపాటు... రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని భాజపా నిర్ణయించింది. రాష్ట్రంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఉత్సవంలా కాకుండా లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి మహమ్మారిని అరికట్టే ప్రయత్నంలో భాగంగానే కార్యక్రమాలుండాలని కోరారు.

ప్రతి డివిజన్‌లో కనీసం 10కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 10వేల కేంద్రాల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.

ఇదీ చదవండి:tokyo olympics: పతకాలు సాధించి.. గుర్తింపు తీసుకురావాలి

Last Updated : May 30, 2021, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details