పీఆర్సీ, ఐఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భాజపాను గెలిపిస్తేనే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయన్నారు.
'అభివృద్ధి కావాలంటే భాజపాను గెలిపించండి' - తెలంగాణ భాజపా వార్తలు
అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. పీఆర్సీ, ఐఆర్ విషయంలో పక్క రాష్ట్రం కంటే వెనకబడి ఉందని... భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.
'అందుకే భాజపాను గెలిపించండి'
మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:మండలిలో నా రికార్డులను చూసి మాట్లాడాలి: రాంచందర్రావు