తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు ఓటమి భయం పట్టుకుంది: నల్లు ఇంద్రసేనారెడ్డి - రంగల్‌, ఖమ్మం, సిద్దిపేట కార్పొరేషన్‌ ఎన్నికలు

వరంగల్‌, ఖమ్మం, సిద్ధిపేట కార్పొరేషన్‌ గడువు ముగుస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ చేపట్టట్లేదని భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే ఎన్నికలను జాప్యం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

BJP senior leader Nallu Indrasena Reddy about corporation elections
తెరాసకు ఓటమి భయం పట్టుకుంది: నల్లు ఇంద్రసేనారెడ్డి

By

Published : Jan 28, 2021, 9:52 AM IST

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో తెరాస ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

రాజ్యాంగం నిర్థేశిస్తోంది..

ఓటమి భయంతోనే.. ప్రభుత్వం వరంగల్‌, ఖమ్మం, సిద్దిపేట కార్పొరేషన్‌ గడువు ముగుస్తున్నప్పటికి డీలిమిటేషన్‌, రిజర్వేషన్ల ప్రక్రియను ఇంత వరకు చేపట్టలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాటి కాలపరిమితి ముగిసే మూడు నెలల ముందుగానే నిర్వహించాలని భారత రాజ్యాంగం నిర్థేశిస్తోందని తెలిపిన ఆయన.. ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:కాస్త ముందుగా బాధ్యత తీసుకున్నా.. అంతే.!

ABOUT THE AUTHOR

...view details